♪♫
TG-3035
Telugu
ఆనందం నీలోనే
Aanandam Neelone
0
views
పల్లవి
ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను – ప్రేమించినావు జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం||
1వ చరణం
పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2) కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం||
2వ చరణం
నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని (2) నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2) నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా సత్యవాక్యమే – జీవవాక్యమే ||ఆనందం||
3వ చరణం
సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై (2) లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2) నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||