♪♫
TG-3038
Telugu
ఆనందము ప్రభు నాకొసగెను
Aanandamu Prabhu Naakosagenu
0
views
పల్లవి
ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను (2) నా యుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||
1వ చరణం
ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2) విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||
2వ చరణం
సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2) నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసే నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము||
3వ చరణం
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్ (2) ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||