TG-3052
Telugu

ఆరాధన… ఆరాధన…

Aaraadhana… Aaraadhana…

0
views
పల్లవి

ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన యోగ్యునికి ఆరాధనను చెల్లించెదము సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సర్వ సంపదలు కురిపించు వానికి సత్య మార్గములో నడిపించు వానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||

1వ చరణం

చీకు చింతలు చుట్టూ ముట్టిన బ్రతుకు గుండె బరువై పోయిన ఆదరించి ఓదార్చే వానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||

2వ చరణం

ఆత్మ ఫలములు ఫలించుటకు ఆత్మ వారములు కురిపించువానికి ఆత్మ అభిషేకం దయచేయువానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||

3వ చరణం

మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే అని పలికిన యేసు తండ్రీ కుమారా పరిశుద్ధాత్మకు ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||