♪♫
TG-4586
Telugu
ఆరాధనా చేయనా నా ప్రియమైన యేసయ్యా
Aaraadhanaa Cheeyanaa Naa Priyamaina Yeesayyaa
18
views
పల్లవి
ఆరాధనా చేయనా నా ప్రియమైన యేసయ్యా నీకు స్తుతి పాటలే పాడనా నీ పరిశుద్ధ సన్నిధిలో స్తుతిపాత్రుడా నా స్తోత్రార్హుడా స్తుతులపైనా ఆసీనుడా ||ఆరాధనా||
1వ చరణం
సంతోషము నీ సమాధానమూ ప్రతినిత్యము నీ సన్నిధిలో సమృద్ధిగా నా కొసగితివే సంపదగనివి నా యేసయ్యా నీ మందిరములో నివసించెద నా బ్రతుకు దినములు స్తుతియించుచు ||ఆరాధనా||
2వ చరణం
ఘనమైనది శాశ్వతమైనది నాయెడల చూపిన నీ ప్రేమ ఘనపరచేదా నీ ఘననామము హృదయము తెరచి ప్రతిదినము గంభీరమైన తేజస్సుతో ఉదయించితివి నా హృదయములో ||ఆరాధనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.