TG-2206
Telugu

ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా

aaraadhanaa neekee aaraadhanaa aaraadhanaa

63
views
పల్లవి

ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా యేసు అన్ని వేళలా (2) నా కష్టాలలో ఆరాధన శోక సంద్రములో నీకే ఆరాధన నా నష్టాలలో ఆరాధన లోకమే నను విడచినా నీకే ఆరాధన ||ఆరాధనా||

1వ చరణం

ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా నను విడువని యేసుని చూస్తూ ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా||

2వ చరణం

రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా సర్వమును భరించు యేసుకే ఆరాధన శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.