TG-4583
Telugu

ఆరాధనకు అర్హుడా నీకే నా ఆరాధన

aaraadhanaku arhudaa neekee naa aaraadhana

Allen Ganta and Jonathan Wesleyవిజయ్ కొండాపురం · Vijay Kondapuramఅల్లెన్ గంట అను శామ్యూల్ , విజయ్ కొండాపురం · Allen Ganta, Anu Samuel , Vijay Kondapuram
26
views
1వ చరణం

ఆరాధనకు అర్హుడా నీకే నా ఆరాధన స్తుతులపై ఆసీనుడా నీకే నా స్తుతి కీర్తన మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా (2)

పల్లవి

ఆరాధన ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా నీకే

2వ చరణం

విరిగిన మనసు నీ బలిపీఠముపై పరిమిళముగా అర్పింతును సిలువనెత్తుకొని నన్ను నే ఉపేక్షించి వెనుతిరుగక వెంబడింతును నా శరీరమును సజీవ యాగముగార్పింతును (2) ||ఆరాధన||

3వ చరణం

అలలెన్నో నా పైకి ఎగిసినను శత్రువులే నన్ను చుట్టినను బలమంతా నాలో క్షీణించినను విశ్వాసమే నాలో కొదువైనను ఆరాధనే నా ఆయుధమై జయింతును (2) ||ఆరాధన||

బ్రిడ్జి

సిలువకై పునరుత్థానికై నా విమోచనకై ఆరాధన నీ మేలులకై విశ్వాస్యతకై శాశ్వత ప్రేమకై ఆరాధన పరిశుద్ధుడా గొఱ్ఱె పిల్ల యూదా సింహమా నీకే ఆరాధన (2) ||ఆరాధన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.