TG-4585
Telugu

ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా

Aaraadhanaku Yoogyudaa Neevee Maa Sthuthula Sthoothraarhudaa

18
views
పల్లవి

ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా పదివేలలో అతి సుందరుడా నీవే మా పూజ్యనీయుడ సెరాపులు కెరుబులతో ఆరాధింప బడుతున్న పరిశుద్దుడా (2) తండ్రి దేవ తండ్రిదేవ నీవే అతిశ్రేష్ఠనీయుడవు తండ్రి దేవ తండ్రిదేవ నీవే బహుకీర్తనీయుడవు (2) నిరంతరం మారనివాడ నా యేసయ్య అనుక్షణం కొనియాడదగినది నీ నామం (2) నా హృదయమే నీ సింహాసనం నాలో నివసించే నిరంతరం (2) నిత్యము నీలో నేను నిలిచియుండాలని ప్రతీదినం నాతో నీవు కలిసియుండాలని (2) ఊపిరి నాలో ఉన్నంత వరకు నీలో ఫలియించే భాగ్యమునిమ్ము (2) అంకితం నీ ప్రేమకై నా జీవితం నీ చిత్తమును నెరవేర్చుటకు నా సర్వం (2) ఊహించలేనే నీ దయలేనిదే నా బ్రతుకు శూన్యం నీ కృపలేనిదే (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.