ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
aaraadhanaku yoogyudaa nityamu stutiyinchedanu
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||
దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2) నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2) ఆరాధన ఆరాధన (2) నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2)
ధనవంతులుగా చేయుటకు దారిద్య్రత ననుభవించినావు (2) హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
