TG-3418
Telugu

ఆరాధనకు యోగ్యుడవు యేసు

aaraadhanaku yoogyudavu yeesu

Daniel JohnJesus Chanan MinistriesBro.Prakash Garu · PrakashBro.Aaron · Prakash
0
views
Chorus

ఆరాధనకు యోగ్యుడవు యేసు మదిలో దేవునిగ కొలువైయున్నావు నిను స్తుతించుచూ పుడమిలోన పరవశించగా నా జిహ్వకు మధురమాయె నీదు గానమే

పల్లవి పూర్వ భాగం

నీ శౌర్యము వివరించుటకు భాష చాలదు వేనోళ్ళతో నిను పొగిడినా తనివి తీరదు ||ఆరాధనకు||

1వ చరణం

అగ్నితో కలిసియున్న స్పటిక సంద్రము యెదుట జయించినవారితో వీణను మ్రోగించుచూ ప్రభువా నీవు మాత్రమే ఎంతో జ్ఞానవంతుడవనుచూ గొఱ్ఱెపిల్ల కీర్తనలతో కొనియాడెదను ||నీ శౌర్యము||

2వ చరణం

ముందు వెనుక కన్నులున్న నాలుగు జీవుల వలెను రేయి పగలు బిగ్గరగా నా స్వరముతో పలుకుచూ ప్రభువా నీవు మాత్రమే ఎంతో మహిమోన్నతుడనుచూ శ్రేష్ఠమైన జ్యేష్ఠులతో కొనియాడెదను ||నీ శౌర్యము||

3వ చరణం

మహాదూతలనబడిన సెరాపులతో నే కలిసి గడపకమ్ముల పునాదులు కదులునట్లు పాడుచూ ప్రభువా నీవు మాత్రమే ఎంతో పరిశుద్ధుడవనుచూ మోక్షమందు దూతలతో కొనియాడెదను ||ఆరాధనకు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.