TG-3053
Telugu

ఆరాధించెద నిను మది

Aaraadhincheda Ninu Madi

0
views
పల్లవి

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను (2) మార్గము నీవే సత్యము నీవే (2) జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద||

1వ చరణం

విస్తారంబగు వ్యాపకములలో విడచితి నీ సహవాసమును (2) సరిదిద్దితివి నా జీవితము (2) నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద||

2వ చరణం

నీ రక్తముతో నను కడిగితివి పరిశుద్దునిగా జేసితివి (2) నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2) నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద||

3వ చరణం

పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు నీ సన్నిధిలో నిలచిననూ (2) లెక్కింపగజాలని జనమందున (2) నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) ||ఆరాధించెద||