♪♫
TG-3055
Telugu
ఆరాధించెదము ఆత్మతో
Aaraadhinchedamu Aathmatho
0
views
పల్లవి
ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనంద గానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును – (2) ||ఆరాధించెదము||
1వ చరణం
అక్షయ నాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2) ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2) అమరుడై యున్నవాడు మన దేవుడు (2) ||ఆరాధించెదము||
2వ చరణం
సత్య స్వరూపి మహోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే (2) ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2) పరమందు ఆసీనుడు పూజార్హుడు (2) ||ఆరాధించెదము||
3వ చరణం
సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2) భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2) యుగములకు కర్తయే శ్రీమంతుడు (2) ||ఆరాధించెదము||