TG-3056
Telugu

ఆరాధించెదము యేసయ్య

Aaraadhinchedamu Yesayya

0
views
పల్లవి

ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2) ఆరాధన ఆరాధన ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము||

1వ చరణం

ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు (2) అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2) అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన||

2వ చరణం

మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు (2) మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2) మహిమ గల దేవుడు నిత్య దేవుడు యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) ||ఆరాధన||

3వ చరణం

దాహము తీర్చు దేవుడు ధన ధాన్యములిచ్చు దేవుడు (2) దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2) ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2) ||ఆరాధన||