TG-3062
Telugu

ఆశ్చర్య కార్యముల్

Aascharya Kaaryamul

16
views
పల్లవి

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2) అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య||

1వ చరణం

రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను జాలరుల మదిలో ఆనందమే యేసుతో పనిలో ఆశ్చర్యమే (2) హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||

2వ చరణం

కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం యేసు మాట నిలుచును తరతరాలు తండ్రిలా పోషించి దీవించును తల్లిలా ఆదరించి ప్రేమించును (2) హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.