TG-3063
Telugu

ఆశ్చర్యాకరుడా

Aascharyakarudaa

0
views
పల్లవి

ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు (2) నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు (2) సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా (2) నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||

1వ చరణం

విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు (2) నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||

2వ చరణం

చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించె (2) నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||