♪♫
TG-3065
Telugu
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్
Aascharyakarudu Aalochanakartha
17
views
పల్లవి
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2) తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు||
1వ చరణం
తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2) తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2) నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు||
2వ చరణం
మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు మనకోసం సజీవుడై లేచినవాడతడు (2) తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2) తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.