ఆశల సుడిగుండంలో చిక్కిన ఓ అతివ
aashala sudigundanloo chikkina oo ativa
ఆశల సుడిగుండంలో చిక్కిన ఓ అతివ దారిని తప్పించుకుని బ్రతుకుట అంతటి సులువ దేవుడిచ్చిన బాధ్యతను మరచిన ఓ మగువ లోకమును ఖాక్షించినావు ఎందుకో అతిగా భర్తను విడిచి భక్తిని మరచి లోకమును చూసిన లోతు భార్యల ఉప్పు స్తంభమౌదువ చరిత్రలో చరగని చేదు నిజమే నీవా... ఆ హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా ||ఆశల సుడిగుండంలో||
పొంగుతున్న సంద్రంలో సుడిగుండాలెన్నో అత్యంత శక్తివంతమై సుడి త్రిప్పును జలరాసులను అతి భారీ ఓడలు సైతం ఆ సుడిగుండంలో చిక్కితే బద్దలై పోవు ఓడ ముక్క చెక్కలై పోవును. అంతకు మించినది ఈ ఆశల సుడిగుండము అందులో చిక్కావ అయ్యో ఓ అతివా అది మ్రింగి వేయును నీ భక్తి అను బ్రతుకు నావ ఆశల సుడిగుండంలో విశ్వాసపు ఓడ బద్దలై హుమనైను,అలెక్సెంద్రు బైబిల్ నందు చదవలేదా (2) ||ఆశల సుడిగుండంలో||
అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండలేక. దైవ వాక్కు ధిక్కరించే ఆశకు దాసోహమైతివి. దేవుడు నిన్ను లెక్క అడిగితే తక్కెటలో తక్కువ తూగితే. అగ్నిగుండమే నీ అంతము అపవాదిది ఈ పంతము దానికి సోపనాలు శరీరాశనే ఎండమావి తీరంలో ఆశ తీర అడుగులెయ్యకు అది మింగి వేయును నీ భక్తి అను బ్రతుకు నావా ఆశల సుడిగుండంలో విశ్వాసపు ఓడ బద్దలై ఆకాను గేహాజిలు బైబిల్ నందు చదవలేదా (2) ||ఆశల సుడిగుండంలో||
పొంగుతున్న కోరికకు నువ్వు బానిస ఐతివి. జాలి లేని లోకానికి నీ బ్రతుకు బలైపోయెను అతిగా నీ ఆర్భాటాలు అపవాదికి అవకాశాలు నిన్ను చేర్చు నరకానికి యుగయుగాలు కాలడానికి నమ్ముము నిత్యము ఈ సత్యమే సౌభాగ్యము అందుకో పరలోకం అది వారిది నీ భాగ్యము (2) అననీయ సప్పిరా బైబిల్ నందు చదవలేదా మరియమ్మ మార్తమ్మ బైబిల్ నందు చదవలేదా ||ఆశల సుడిగుండంలో||
