TG-4592
Telugu

ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు

Aashcharyakarudu Aaloochanaakartha Balavanthudaina Deevudu

0
views
పల్లవి

ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యేసే అందరి దేవుడు (2) కన్యకు పుట్టినాడు పరిశుద్ధ దేవుడు పాపాలు కడిగివేసే ఈ లోక రక్షకుడు (2) కొనియాడి పాడి వేడేదం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ (2) వాక్యమైయున్న ఆ దేవుడు సర్వ సృష్టికి కారణ భూతుడు శరీరధారిగ యేసు నామములో యిలలో జన్మించెనూ (2) సృష్టికర్త యైన యేసు మనము నమ్మిన సృష్టి అంతటి పై జయము మనదే అగును (2) ||హ్యాపీ||

1వ చరణం

నశించిపోతున్న ఈ లోక ప్రజలను ప్రేమతో రక్షించాలని సిలువలో మరణించి తిరిగి లేచుట కు ఇలలో జన్మించెను (2) ప్రభువైన యేసయ్యను మనమూ నమ్మిన మనము మన ఇంటి వారు రక్షణ పొందేదం (2) ||హ్యాపీ||

2వ చరణం

తల్లి తన బిడ్డనూ మరచిన నేను నిను మరువను అనినా దేవదేవుడె ఇమ్మానుయేలుగ యిలలో జన్మించెను (2) దిగులు వద్దు భయము వద్దు అని చెప్పిన మన యేసుని మదిలో తలచి ఆరాధించెదం (2) ||హ్యాపీ||