TG-1006
Telugu

ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ

aashcharyamaina preema kalvarilooni preema

185
views
పల్లవి

ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది – 2 నన్ను జయించే నీప్రేమ

1వ చరణం

పరమును వీడిను ప్రేమ ధరలో -పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించీ,ఆదరించీ,సేదదీర్చీ,నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన ప్రేమ||

2వ చరణం

పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి,జీవమిచ్చీ జయమిచ్చి తన మహిమనిచ్చే ||ఆశ్చర్యమైన ప్రేమ||

3వ చరణం

నాస్థితి జూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి,కౌగిలించి ముద్దాడి, కన్నీటిని తుడిచెను ||ఆశ్చర్యమైన ప్రేమ||

4వ చరణం

శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడనీ,ప్రేమదీ ఎన్నడు ఎడబాయనిది ||ఆశ్చర్యమైన ప్రేమ||