ఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు మీశ

aasheeravanbu lmaameemda varssinpajeeyu meesha

🎵 TG-386💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు మీశ యాశతో నమ్మి యున్నాము నీసత్య వాగ్దత్తము. ||ఆశీరవంబు ల్మామీఁద||

1వ చరణం

ఓ దేవ పంపింప వయ్యా నీ దీవెన ధారలన్ మా దాహ మెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ ||ఆశీరవంబు ల్మామీఁద||

2వ చరణం

మామీఁద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీఁద క్షామంబు పోనట్లుగన్. ||ఆశీరవంబు ల్మామీఁద||

3వ చరణం

ఈనాఁడె వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేఁడి సన్నుతిఁ బ్రార్థింతుము. ||ఆశీరవంబు ల్మామీఁద||

Report Error