TG-1016
Telugu

ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా

aashrayadurgamaa.... naa yeesayyaa

196
views
పల్లవి

ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా.... నవజీవన మార్గమునా.. నన్ను నడిపించుమా... ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావే ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా

1వ చరణం

లోక మర్యాధలు - మమకారాలు -గతించి పోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే... (2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 ||ఆశ్రయ||

2వ చరణం

నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెర వేర్చు చుంటినే నీతో చేసిన.. తీర్మానములు స్థిరపరచితివే...(2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 ||ఆశ్రయ||

3వ చరణం

పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద...(2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 ||ఆశ్రయ||

4వ చరణం

నిత్య నివాసినై నీముఖము చూచుచు పరవశించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించు చున్నది (2) స్తుతి,ఘనమహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా - హల్లేలూయా - హల్లెలూయా.... 2 ||ఆశ్రయ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.