♪♫
TG-3078
Telugu
ఆత్మ విషయమై
Aathma Vishayamai
14
views
పల్లవి
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది (2) దుఃఖ పడు వారలు ధన్యులు వారు ఓదార్చబడుదురు (2) సాత్వికులైన వారు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2) ||ఆత్మ||
1వ చరణం
నీతిని ఆశించువారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు (2) కనికరము గలవారు ధన్యులు వారు దేవుని కనికరము పొందుదురు (2) ||ఆత్మ||
2వ చరణం
హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు (2) సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు (2) ||ఆత్మ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.