ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన
aathmeeya gaanaalathoo ninnee aaraadhana
ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా (2) మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా ఆరాధించనా నీ పాద సన్నిధి స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ||
సమీపించరాని తేజస్సులో వసియించుచున్న పరిశుద్ధుడా కెరూబులు సెరాపులు దీవా రాత్రులు నీ సన్నిధిలో స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి||
అందరిలోను అతి శ్రేష్టుడా వేల్పులలోన మహనీయుడా పూజార్హుడా స్తోత్రార్హుడా అతి సుందరుడా మనోహరుడా చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా అపరంజిని పోలిన పాదాలు గలవాడా (దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన స్వరమును కలిగిన ఘననీయుడా శిరము వంచనా సర్వోన్నతుడా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.