TG-2992
Telugu

అభిషేకమా ఆత్మ అభిషేకమా

abhisheekamaa aatma abhisheekamaa

14
views
Chorus

అభిషేకమా ఆత్మ అభిషేకమా ఏడంతల బలముతో మమ్ము నింపుము అభిషేకమా (2) మాకు కావాలయ్యా ఆత్మ అభిషేకము అగ్నిజ్వాలల వలె మమ్ము మండించుము (2) ||అభిషేకమా||

1వ చరణం

పిరికివాడిగా దాగిన గిద్యోనును పరాక్రమశాలిగ చేసిన అభిషేకం ప్రాణ భయముతో బెదిరిన పేతురును గర్జించువానిగా మార్చిన అభిషేకం (2) ||మాకు కావాలయ్యా||

2వ చరణం

ఈ లోకములో మమ్మును భయపెట్టే శ్రమల దూరము చేసే అభిషేకం భూలోకము నుండి పరలోకము చేర్చే కృపతో నిండిన క్రీస్తుని అభిషేకం (2) ||మాకు కావాలయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.