TG-4551
Telugu

అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా

Abrahaamu Nammina Deevudaa Naa Pitharula Aaraadhya Daivamaa

0
views
పల్లవి

అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా ఇశ్రాయేలు కాపరి - బహుగొప్ప నేర్పరి నీకు సాటియెవరు యేసయ్యా సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా - ప్రభాకరుడా బహు బలవంతుడా సత్యవంతుడా మహా పరిశుద్ధుడా - ఆరాధనకు యోగ్యుడా 1. నీలి మేఘమును నీడగా మార్చి అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి (2) సైన్యములకు నీవే సారధిగా నిలిచి నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన మా పక్షమైయున్న మహారాజువు నీవే నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా ||సహాయకుడా||

1వ చరణం

2. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించెదవు (2) విస్తారమైన నీకృపలతో నింపి నిస్సారమైన బ్రతుకును మార్చెదవు విజయోత్సవముతో ఊరేగించెదవు నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా ||సహాయకుడా||

2వ చరణం

3. సాత్వీకముతో - దీర్ఘశాంతముతో విసుగక నాయెడల వాత్సల్యము చూపి (2) ఒంటరిగా నను ఎన్నడు విడువక వేదనలో నను దాటి వెళ్లక తల్లివలె ఒడిలో లాలించువాడవు తీరని నీ రుణము వివరింప తరమా ||సహాయకుడా||