TG-1147
Telugu

అడగకముందే అక్కరలనెరిగి

adagakamundee akkaralanerigi

219
views
పల్లవి

అడగకముందే అక్కరలనెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా... ఎందరువున్న బంధువు నీవై బంధాలను పెంచినా భాగ్యవంతుడా...

3వ చరణం

పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నాపాటగా మరీ మరీ నేను చాటుకోన మనసంత పులకింత నీ సాక్షిగా నా జీవిత గమనానికి గ మ్యము నీవే చితికిన నా గుండెకు రాగము నీవే (2) ||పదే|| మమతల మహారాజ యేసు రాజా (3)

1వ చరణం

అడగ ముందే అక్కరలనెరిగి అవసరాలను తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్న బంధువు నీవై బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) అవసరాలు తీర్చిన ఆత్మీయుడా... బంధాలను పెంచిన భాగ్యవంతుడా... (2) మమతల మహారాజ యేసు రాజా (3) ||అడగకముందే||

2వ చరణం

అలిగినవేళా అక్కునచేరి అనురాగము పంచిన అమ్మవు నీవే నలిగిన వేళా నాధరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) అనురాగము పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.