TG-1515
Telugu

అడవి చెట్ల నడుమ ఒక

adavi chetla naduma oka

107
views
పల్లవి

అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు (2) కీర్తింతున్ నా ప్రభుని జీవ కాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను షారోను రోజా ఆయనే లోయ పద్మమును ఆయనే అతిపరిశుద్ధుడు ఆయనే పదివేలలో అతిశ్రేష్టుడు ||కీర్తింతున్||

1వ చరణం

పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించెగా నింద శ్రమ సంకటంలో నను సుగంధముగా చేయున్ మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి నా త్రోవకు దీపం నీవే నా బ్రతుకుకు జీవం నీవే నా సేవకు బలము నీవే నా ఆత్మకాదరణ నీవే ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమున నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని నేనే నీ దేవుడనని భయపడకు-మని అంటివి

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.