TG-4545
Telugu

అద్భుత ప్రేమ ఇది అంతమే లేనిది వర్ణనకందనిది అద్వితీయమే ఇది

Adbhutha Preema Idi Anthamee Leenidi Varnanakandanidi Advitheeyamee Idi

17
views
పల్లవి

అద్భుత ప్రేమ ఇది అంతమే లేనిది వర్ణనకందనిది అద్వితీయమే ఇది డంబమే లేనిది ఎన్నడు మారనిది నా యేసు ప్రేమ నా తండ్రి ప్రేమ ఇల కనుగొననేలేని నిలకడయైన ప్రేమ వెలి వేయబడిన వారిని వెల లేని పాత్రలుగా మలిచి పరదేశులైన వారిని ప్రధానులుగా హెచ్చించి ఘన సేవ భాగ్యమునిచ్చి (తన) జతగా నిలిపిన ప్రేమ ప్రతి ఆకోరు లోయ మార్గమును నిరీక్షణ ద్వారముగ మార్చి ఖడ్గమును తొలగించి యుద్ధము మాన్పించి (కడు) శ్రేష్ఠ స్వాస్థ్యమునిచ్చి తన ప్రజలని తెలిపిన ప్రేమ

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.