♪♫
TG-4546
Telugu
అద్భుతం చేయువాడ అతిశయమిచ్చువాడ
Adbhuthan Cheeyuvaada Athishayamichchuvaada
0
views
పల్లవి
అద్భుతం చేయువాడ అతిశయమిచ్చువాడ ఆలోచన కారుడా నా యేసు రాజా నీవే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా (2) ||అద్భుతం||
1వ చరణం
మోషే మాటతో ఉన్నవాడా నేతగా పిలచి నడిపినవాడ నా బలహీనత బలముగ మార్చి నీ పాత్రగా నను నిలుపు వాడా ||హల్లెలూయా||
2వ చరణం
పగటిలో మేఘమై ఉండువాడా రాత్రిలో అగ్నిఐ వెలిగించువాడ తడబడక ప్రతి అడుగులో తోడై నా చేయిపట్టి నడుపు వాడా ||హల్లెలూయా||
3వ చరణం
కడవరుకు యోబుతో ఉన్నవాడా రెండంతలు తిరిగి దయచేయువాడ కష్టములేమి నష్టములోనా నా చేయి విడివక నిలుపు వాడా ||హల్లెలూయా||