అడిగినది కొంతే అయినా పొందినది
adiginadi konthee ayinaa pondinadi
అడిగినది కొంతే అయినా పొందినది ఎంతో దేవా ప్రతిగా ఏమివ్వగలనయా నిను స్తుతియించే హృదయము తప్ప నా జీవితం నీకే అంకితమయ్యా – (4) ||అడిగినది||
ఊహించలేని వివరింపజాలని నీ కార్యములు ఆశ్చర్యమే యోచించినా నా వర్ణనకందని నీ కృపా కనికరములు అత్యున్నతమే తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా యుగయుగములకు నీకే ఘనతా మహిమా సతతం నిను నే కొనియాడెదను సకలం నీ నామముకే స్తోత్రము తగును క్షణ భంగురం నా క్షయ జీవితం కాచావయ్యా నను నీ రెక్కల నీడ ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా మహిమోన్నతుడా నను మరువని విభుడా ప్రణుతించెదను నిన్నే నిరతం నిష్కలంకుడా నిర్మలాత్ముడా ప్రకటించెదను నీ పావన చరితం నా అతిశయము నీవే నా యేసయ్యా నా ఆధారము నీవే నా మెస్సయ్యా నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా ఈ దీన సేవను చేకొనుమయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.