♪♫
TG-3091
Telugu
అదిగో నా నావ
Adigo Naa Naava
16
views
పల్లవి
అదిగో నా నావ బయలు దేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు (2) వరదలెన్ని వచ్చినా వణకను అలలెన్ని వచ్చినా అదరను (2) ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో||
1వ చరణం
నడిరాత్రి జాములో నడచినా నది సముద్ర మధ్యలో నిలచినా (2) నడిపించును నా యేసు నన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో||
2వ చరణం
లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2) సూర్యుడైన ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోవును (2) ||అదిగో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.