TG-1335
Telugu

అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ

adigoo adigoo adigoo adigoo rendava raakada

205
views
పల్లవి

అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ అది ఉప్పెన లాగ వస్తుందండి రెండవ రాకడ

1వ చరణం

ప్రళయం వలె వచ్చునండి రెండవ రాకడ అది పరిశుద్దుల కొరకేనండి రెండవ రాకడ ||అదిగో అదిగో||

2వ చరణం

మంగళ ధ్వనులు మింటగ మ్రోగను రెండవ రాకడ ప్రధాన దూత శబ్దము తోను రెండవ రాకడ ||అదిగో అదిగో||

3వ చరణం

మేఘారూడై వచ్చును యేసు రెండవ రాకడ ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ ||అదిగో అదిగో||

4వ చరణం

శబ్దం విన్నా సోదరులంతా రెండవ రాకడ ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ ||అదిగో అదిగో||

5వ చరణం

మిగిలిన వారికి ముప్పతిప్పలు రెండవ రాకడ తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ ||అదిగో అదిగో||

6వ చరణం

ఆకాశమందు వింతలు కల్గును రెండవ రాకడ శక్తులు కదలి మింటను రాలును రెండవ రాకడ ||అదిగో అదిగో||

7వ చరణం

భరించలేని బాధలు కలుగును రెండవ రాకడ చద్దామన్నా చావే రాదు రెండవ రాకడ ||అదిగో అదిగో||

8వ చరణం

సూర్య చంద్రులు చీకటి కలుగును రెండవ రాకడ ఎక్కడ చూచిన అందకారమే రెండవ రాకడ ||అదిగో అదిగో||

9వ చరణం

ఇద్దరు తిరగలి విసరుచుండగ రెండవ రాకడ అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ ||అదిగో అదిగో||

10వ చరణం

ఇద్దరు పొలములో - పనికి వెళ్ళగా రెండవ రాకడ అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ ||అదిగో అదిగో||

11వ చరణం

బస్సులో డ్రైవరు ఎగిరి పోవును రెండవ రాకడ బస్సు గుంటలో బోల్తాపడును రెండవ రాకడ ||అదిగో అదిగో||

12వ చరణం

శవమును మోసుకుపోవుచుండగా రెండవ రాకడ మధ్యలో శవము లేచిపోవును రెండవ రాకడ ||అదిగో అదిగో||

13వ చరణం

బడిలో పిల్లలు చదువుచుండగా రెండవ రాకడ అందులో అందరు ఎత్తబడుదురు రెండవ రాకడ ||అదిగో అదిగో||

14వ చరణం

తప్పవు తిప్పలు తక్కిన వారికి రెండవ రాకడ తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ ||అదిగో అదిగో||

15వ చరణం

నదిలో నీళ్ళు రక్తం అగును రెండవ రాకడ త్రాగాలంటే నీరే దొరకదు రెండవ రాకడ ||అదిగో అదిగో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.