♪♫
TG-1290
Telugu
అదిగో నా నావ బయలుదేరుచున్నది
adigoo naa naava bayaludeeruchunnadi
200
views
పల్లవి
అదిగో నా నావ బయలుదేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు
1వ చరణం
అలలెన్ని వచ్చినా అదరను వరదలెన్ని వచ్చినా వణకను ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయంబు ఆయనే ||అదిగో||
2వ చరణం
లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నొ తిరుగుచున్నది సూర్యుడైన ఆగిపోయినా చుక్కాని మాత్రం సాగిపోవును ||అదిగో||
3వ చరణం
నడిజాము రాత్రిలో నడిచినా నడిసంద్రము మధ్యలో నిలచినా నడిపించును నా యేసు నన్ను అద్దరికి నడిపించును ||అదిగో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.