TG-3092
Telugu

అడుగడుగున రక్త

Adugaduguna Raktha

13
views
పల్లవి

అడుగడుగున రక్త బింధువులే అణువణువున కొరడా దెబ్బలే (2) నా యేసుకు ముళ్ల కిరీటం భుజములపై సిలువ భారం (2) భుజములపై సిలువ భారం ||అడుగడుగున||

1వ చరణం

సిలువ మోయుచు వీపుల వెంట రక్త ధరలే నిన్ను తడిపెను (2) నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున||

2వ చరణం

కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా (2) చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున||

3వ చరణం

మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2) మహిమ స్వరూపా మా యేసయ్యా మహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగడుగున||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.