♪♫
TG-1793
Telugu
అడుగడుగున రక్త బింధువులే అణువణువున
adugaduguna raktha bindhuvulee annuvannuvuna
104
views
పల్లవి
అడుగడుగున రక్త బింధువులే అణువణువున కొరడా దెబ్బలే (2) నా యేసుకు ముళ్ల కిరీటం భుజములపై సిలువ భారం ||అడుగడుగున||
1వ చరణం
సిలువ మోయుచు వీపుల వెంట రక్త ధరలే నిన్ను తడిపెను నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున||
2వ చరణం
కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం మహిమ స్వరూపా మా యేసయ్యా మహిమగా నన్ను మార్చినావా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.