TG-3096
Telugu

ఏ గుంపులో నున్నావో

Ae Gumpulo Nunnaavo

0
views
పల్లవి

ఏ గుంపులో నున్నావో ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2) జాగు చేయక వేగ మేలుకో (2) ||ఏ గుంపులో||

1వ చరణం

మరణమనెడి మొదటి గుంపు మారని గుంపు – నిర్జీవపు గుంపు (2) దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) ||ఏ గుంపులో||

2వ చరణం

మెచ్చుఁకొనుట కిచ్చకంబు లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2) చచ్చియుండిన సమాధుల గుంపు (2) ||ఏ గుంపులో||

3వ చరణం

కరుణ లేక కఠినమైన కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2) కరకు కల్గిన కఠోరపు గుంపు (2) ||ఏ గుంపులో||

4వ చరణం

యేసు వాక్యమనగ నేమో ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2) ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) ||ఏ గుంపులో||

5వ చరణం

ధరణి నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2) పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) ||ఏ గుంపులో||

6వ చరణం

పరమ తండ్రి కడకు జేర పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2) కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) ||ఏ గుంపులో||

7వ చరణం

సర్వ లోక మోసగాడు ఆది సర్పము – అదే ఘట సర్పము (2) సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) ||ఏ గుంపులో||

8వ చరణం

వధువు మంద మేయు మర్మ మనగ గమనిక – గమనించి తెలుసుకో (2) గదిలో చేరుకో పదిలపర్చుకో (2) ||ఏ గుంపులో||