TG-3098
Telugu

ఏ పాపమెరుగని యో

Ae Paapamerugani Yo

0
views
పల్లవి

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||

1వ చరణం

కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప||

2వ చరణం

చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప||

3వ చరణం

ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||

4వ చరణం

పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప||

5వ చరణం

బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప||

6వ చరణం

కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||