TG-192
Telugu

ఐదు గాయము లొందినావా నాకొర!

aidu gaayamu londinaavaa naakora

200
views
పల్లవి

ఐదు గాయము లొందినావా నాకొర! కైదు గాయము లొంది నావా ఐదు గాయముల నా యాత్మఁ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే ||ఐదు గాయము||

1వ చరణం

గార మైన నీ శ రీర రక్త మిలను ధారయై కారినదా నా నేరమా యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా ||ఐదు గాయము||

2వ చరణం

అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై రాలెనే యీ చంద మూహింప నా డెందమ్ము భీతిచేఁ గొందలమై తూలెనే ||ఐదు గాయము||

3వ చరణం

ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొఱ్ఱె పిల్లవు నీవేగదా నా వల్లనా నీ కింత యల్లాట పుట్టెనే చెల్ల తాళునె నా యెద ||ఐదు గాయము||

4వ చరణం

భంగమౌనట్టి దు ష్పాపులఁ గావ నీ ప్రాణ మర్పించితివా యీ సంగతిఁ జూడ నీ సాహస మింక నే భంగి నీ జగతి మరవ ||ఐదు గాయము||

5వ చరణం

ఆయాసమైన నీ యాపదలెల్ల నే నాలోచింపఁగ నాత్మలో నెడ బాయక తద్దివ్య పాదసరోజముల్ భాసిల్లు నా యాత్మలో ||ఐదు గాయము||

6వ చరణం

తల్లికైన మరి తండ్రి కైన నన్న దమ్ముల కైన లేదే కన్న పిల్లలకైన నీ ప్రేమఁ పోల్చుద మన్నఁ బృథివిలోఁ గానరాదే ||ఐదు గాయము||

7వ చరణం

ఈ ప్రీతి నీ యోర్మి నీ మహాత్మ్యం బిల నెవ్వ రూహింతు రొగి నో హో ప్రభువా తద్ద యోత్కట గాంభీర్య మూహింప నీకే తగు ||ఐదు గాయము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.