అలల పైనే నడచినా నాదు యేసయ్యా- ఆదు కోవయ్యా
alala painee nadachinaa naadu yeesayyaa- aadu koovayyaa
అలల పైనే నడచినా నాదు యేసయ్యా- ఆదు కోవయ్యా ..(2) గలిబిలిని నా కలవరములను - తొలగచేసిన కలుషహరుడా (2) నాదు యేసయ్యా... ఆదు కోవయ్యా... నాదు యేసయ్యా
శుద్ధుడా నీ పిలుపు వింటిని - అద్దరికి నే పయన మైతిని (2) ప్రొద్దుపోయెను భయము లాయెను - ఉద్ధరించగ స్వామి రావా ||ఆదు||
నట్టనడి సంద్రాన రేగెను- అట్టహాసపు పెనుతుఫాను (2) గట్టుచూడగా చాల దూరము - ఇట్టి శ్రమలలో చిక్కు కొంటిని ||ఆదు||
అలలు నాపై విసరి కొట్టగా - నావ నిండుగా నీరు చేరెను (2) బ్రతుకులెంతో భారమాయెను - రేవు చేరే దారి లేదా ||ఆదు||
మాట మాత్రపు సెలవు చేత - సూటిగా అద్భుతములెన్నో (2) చాల చేసిన శక్తి మంతుడా - జాలి చూపి మమ్ము బ్రోవుమా ||ఆదు||
చిన్న జీవిత నావ నాది - నిన్నేగురిగా పయనమైతిని ఎన్నోశోధన లెన్నో భయములు - కన్నతండ్రి కానరావా ||ఆదు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.