TG-410
Telugu

అలసటపడ్డ నీవు దేవోక్తి విను

alasatapadda neevu deevookthi vinu

207
views
పల్లవి

అలసటపడ్డ నీవు దేవోక్తి విను రా, నా యొద్ద, సు విశ్రాంతి పొందుము

1వ చరణం

నేను చూచు గుర్తు లేవి, వాని కుండునా? 'ప్రక్కఁ గాలుసేతులందు గాయముల్' ||అలసటపడ్డ నీవు||

2వ చరణం

రాజుఁబోలి కిరీటంబు వాని కుండునా 'యుండుగాని ముండ్లచేత నల్లరి' ||అలసటపడ్డ నీవు||

3వ చరణం

నన్ను ఁ జేర్చుకొమ్మనంగఁ జేర్చుకొనునా? 'ఔను లోకాంతంబు దాఁక చేర్చును' ||అలసటపడ్డ నీవు||

4వ చరణం

వాని వెంబడింతు నేని యేమి లాభము? 'పాప దుఃఖ కష్టములు వచ్చును' ||అలసటపడ్డ నీవు||

5వ చరణం

చావుమట్టు కోర్తునేని ఏమి యిచ్చును? 'సంతోషంబు సౌఖ్య మింక మోక్షము' ||అలసటపడ్డ నీవు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.