TG-2534
Telugu

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా

alphaa omeegayaina – mahimaanvithudaa

83
views
పల్లవి

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2) రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా||

1వ చరణం

కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నను చేసెను నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.