♪♫
TG-3109
Telugu
అంబరానికి అంటేలా
Ambaraaniki Antelaa
0
views
పల్లవి
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2) అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2) సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2) ||లాల||
1వ చరణం
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు దీనులను రక్షించే దేవ తనయుడు (2) దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె విజయ వీరుడై ఉద్భవించెనే (2) పశుల పాకలో పరుండియుండెనే ||లాల||
2వ చరణం
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసెనని (2) తార వెంబడి వెళ్లి వారు కానుకలర్పించి ఆరాధించారు (2) ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ||లాల||
3వ చరణం
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2) పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూత గణములే జోల పాడగా (2) సృష్టికి బహు సంబరమాయెగా ||లాల||