TG-3110
Telugu

అంబరాన్ని దాటే

Ambaraanni Daate

12
views
పల్లవి

అంబరాన్ని దాటే సంబరాలు నేడు నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2) రండయ్యో రండి రండి దావీదు పురముకు (2) రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని||

1వ చరణం

దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము ఏకైక తనయుని పంపెను ఈ దినము (2) పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2) అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో||

2వ చరణం

దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2) లోకాల కారకుడు లోకమున పుట్టెను (2) మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.