అందాల తార అరుదించెనాకై - అంబర వీధిలో

andaala thaara arudinchenaakai - anbara veedhiloo

🎵 TG-1003🌐 Telugu
పల్లవి

అందాల తార అరుదించెనాకై - అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవనిజాటుచున్‌ ఆనందసంద్ర ముప్పొంగెనాలో - అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు - పయనమైతిని ||అందాల||

1వ చరణం

విశ్వాశయాత్ర దూరమెంతైన - విందుగదోచెను వింతైన శాంతి వర్షించెనాలో - విజయ పధమున విశ్వాలనేలేడి దేవ కుమారుని - వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్‌ ||అందాల||

2వ చరణం

యెరూషలేము రాజనగరిలో - యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి యేసయ్య తార యెప్పటివోలె - ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు - యేగితిస్వామి కడకు ||అందాల||

3వ చరణం

ప్రభు జన్మ స్థలము పాకయేగాని - పరలోక సౌధమే బాలుని జూడ జీవితమంత - పావనమాయెను ప్రభు పాద పూజ ధీవెనకాగ - ప్రసరించె పుణ్యము బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన ||అందాల||

Report Error