అందాల తార మెరిసెను
రారాజు రాక తెలిపెను
ప్రభుని రాక నెరిగి - అవని మురిసెను
విభుని రాక నెరిగి - జగతి సంతసించెను
బెత్లహేము పురములో - జన్మించే దేవనందుడు
మహిమతేజ కాంతుడు మరియసుతుడు
శుభదినం ఈ దినం మానవాళికిది పర్వదినం
శుభదినం ఈ దినం మానవాళి రక్షణదినం
దైవదూత సందేశం - మహిమ భరిత ఆగమనం
ప్రేమమయునిగా ప్రేమను పంచగరాగా
చలిత లలిత మిళిత - ఘణ స్తోత్రములు
మిన్నులు దాటెను - జయ గీతములై
కొనియాడుమా ఓ మానవ - కొనియాడుమా ఓ మానవ
శుభదినం ఈ దినం మానవాళికిది పర్వదినం
శుభదినం ఈ దినం మానవాళి రక్షణదినం
దివిని విడిచి దైవమే - భువిలో వెలసె నరునిగా
పాపహరునిగా - సిలువలో మరణించి
మరణ మ్రుళ్ళు విరిచి - గెలిచి లేచెను
రక్షణ భాగ్యం కలిగె మనకు
ప్రణతిల్లుమా ఓ సంఘమా - ప్రణతిల్లుమా ఓ సంఘమా
శుభదినం ఈ దినం మానవాళికిది పర్వదినం
శుభదినం ఈ దినం మానవాళి రక్షణదినం ||అందాల తార||
andaala thaara merisenu
raaraaju raaka thelipenu
prabhuni raaka nerigi - avani murisenu
vibhuni raaka nerigi - jagathi santhasinchenu
bethlaheemu puramuloo - janminchee deevanandudu
mahimatheeja kaanthudu mariyasuthudu
shubhadinan ee dinan maanavaallikidi parvadinan
shubhadinan ee dinan maanavaalli rakshanadinan
daivadootha sandeeshan - mahima bharitha aagamanan
preemamayunigaa preemanu panchagaraagaa
chalitha lalitha millitha - ghana sthoothramulu
minnulu daatenu - jaya geethamulai
koniyaadumaa oo maanava - koniyaadumaa oo maanava
shubhadinan ee dinan maanavaallikidi parvadinan
shubhadinan ee dinan maanavaalli rakshanadinan
divini vidichi daivamee - bhuviloo velase narunigaa
paapaharunigaa - siluvaloo maraninchi
marana mrullllu virichi - gelichi leechenu
rakshana bhaagyan kalige manaku
pranathillumaa oo sanghamaa - pranathillumaa oo sanghamaa
shubhadinan ee dinan maanavaallikidi parvadinan
shubhadinan ee dinan maanavaalli rakshanadinan ||andaala thaara||