TG-3120
Telugu

అందాల ఉద్యానవనమా

Andaala Udyaanavanamaa

0
views
పల్లవి

అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2) పుష్పించలేక ఫలియింపలేక (2) మోడై మిగిలావ నీవు (2) ||అందాల||

1వ చరణం

ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా (2) కాచావు నీవు కారు ద్రాక్షాలు (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

2వ చరణం

ప్రభు యేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2) పెరిగావు నీవు ఫలియింపలేక (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

3వ చరణం

ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2) ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2) ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||