♪♫
TG-3121
Telugu
అందాలు చిందే శుభ
Andaalu Chinde Shubha
0
views
పల్లవి
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2) కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు||
1వ చరణం
చిననాటి పుట్టింటి నడకా సాగాలి అత్తింటి దాకా (2) ఎంత ఘనమైన బంధం వెయ్యేండ్ల వివాహ బంధం (2) ||అందాలు||
2వ చరణం
సంసార సాగర పయనం తెర చాటు అనుభూతి వినయం (2) సాగిపోవాలి పయనం చేరుకోవాలి గమ్యం (2) ||అందాలు||
3వ చరణం
యేసయ్య పాదాల చెంత వదలాలి ఎదలోని చింత (2) క్రీస్తు పుట్టాలి నీలో చేర్చుకోవాలి హృదిలో (2) ||అందాలు||