అందరిలోను ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు
andariloonu unnaavu, annee neevai unnaavu
అందరిలోను ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు విశ్వాసముతో ప్రభువా అంటే, ఎదురుగా వచ్చి నిలబడతావు || యేసయ్యా, మా మనసే నీదయ్యా యేసయ్యా, మా మనవే వినవయ్యా ||
పువ్వులలోన ఉన్నావు, నవ్వులలోన ఉన్నావు ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నీవే ఉంటావు || యేసయ్యా ||
ఉపకారములో ఉన్నావు, సహకారములో ఉన్నావు అనుదినము మా ఆహారములో భాగము నీవై ఉన్నావు || యేసయ్యా ||
దీనుల కొరకై ఉన్నావు, అనాధుల కోసం ఉన్నావు కరుణామయుడా దయ చూడండి ఇట్టే ఆ దరి చేరుస్తావు || యేసయ్యా ||
రోగుల మధ్యన ఉన్నావు, పాపాత్ములకై ఉన్నావు బోధకుడా నువు మము బ్రోవంటే ప్రేతాత్మలనే తరిమేస్తావు || యేసయ్యా ||
యేసయ్య నా మనసే నీదయ్యా యేసయ్య నా మనవే వినవయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
