TG-3125
Telugu

అందరు మెచ్చిన

Andaru Mechchina

18
views
పల్లవి

అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2) క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||

1వ చరణం

సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పరుండినాడు (2) నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు (2) నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||

2వ చరణం

ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు (2) తప్పును తెలిసి తిరిగి రాగా క్షమియించి కృప చూపినాడు (2) ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||

3వ చరణం

పాత దినములు క్రొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు (2) కటిక చీకటే వేకువ కాగా అంబరమందు సంబరమాయే (2) హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.