♪♫
TG-3128
Telugu
అంజలి ఘటియింత
Anjali Ghatiyinthu
19
views
పల్లవి
అంజలి ఘటియింతు దేవా (2) నీ మంజుల పాదాంబుజముల కడ నిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి||
1వ చరణం
పరమాత్మ నీ పాద సేవ చిరజీవ సంద్రాన నావ (2) సిలువ మహా యజ్ఞ సింధూర రక్తా రుణమేయ సంభావనా (2) దేవా దేవా యేసు దేవా (2) అంజలి ఘటియింతు దేవా ||అంజలి||
2వ చరణం
అవతార మహిమా ప్రభావ సువిశాల కరుణా స్వభావ (2) పరలోక సింహాసనాసీన తేజో విరాజమాన జగదావనా (2) దేవా దేవా యేసు దేవా (2) అంజలి ఘటియింతు దేవా ||అంజలి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.