TG-3129
Telugu

అంకితం ప్రభూ నా

Ankitham Prabhu Naa

0
views
పల్లవి

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2) నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2) మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||

1వ చరణం

కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||